ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు సిద్ధమవ్వండి..ఎదురుచూస్తున్న ‘భీమ్లా’ అప్డేట్ వచ్చేసింది

మెగా అభిమానులతో పాటు చిత్రసీమ అంత ఎంతగానో ఎదురుచూస్తున్న అసలైన అప్డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్..సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ అంటూ కలెక్షన్ల మోత మోగించేందుకు వస్తున్నాడు. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం తో ఆ రోజంతా పవన్ హంగామా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ రానున్నాయి.

అంతకన్నా ముందే పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.