పొన్నియన్ సెల్వన్ టాక్ ఎలా ఉందంటే..

మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ..మొదటి భాగం పీయస్-1 (పొన్నియన్ సెల్వన్) ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదలైంది. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు అయిపోవడంతో టాక్ ఎలా ఉందనేది బయటకు వస్తుంది. సినిమా చూసిన సినీ లవర్స్ సినిమాకు మిక్సిడ్ టాక్ ఇస్తున్నారు.
ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్లతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయేలా సాగిందని , మరీ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత నిరాశ పరుస్తుందని , కానీ, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్లో ఉందని అంటున్నారు. సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్‌లో క్వాలిటీ మిస్ అవడం, కథ ఫ్లాట్‌గా సాగడం మూవీ కి మైనస్ గా చెపుతున్నారు. ఇందులో నటీనటులంతా చక్కగా నటించారని , అయితే, అక్కడక్కడా దర్శకత్వ లోపం కనిపించిందని చెపుతున్నారు.