నిర్భయ దోషుల న్యాయవాదిపై రామ్‌ గోపాల్‌ వర్మ ఆగ్రహం

నిర్భయ దోషులకు శిక్ష పడకుండా ఏపీ సింగ్‌ అడ్డుపడుతున్నాడు

ram gopal varma
ram gopal varma

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడకుంటా అడ్డుకుంటున్న న్యాయవాది ఏపీ సింగ్‌పై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశాడు. మురికి మనిషి ఏపీ సింగ్‌ నీతినియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునైనా కాల్చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో చూడండి. ఇది మన సిస్టమ్‌కు ఉరి వేస్తూ అతడు వేసిన ఒట్టు అది. మన దేశానికి ఎంతో అవమానకరం అంటూ 2013లో ఏపీ సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ లింక్‌ను షేర్‌ చేశాడు. అత్యంత క్రూరంగా, అహంకారంతో మన వ్యవస్థను న్యాయవాది ఏపీ సింగ్‌ మార్చుతుంటే.. మన వ్యవస్థ కంటే తెలంగాణ పోలీసులపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం కలుగుతుంది, నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనివ్వని ఏపీ సింగ్‌ సవాల్‌ చేస్తున్నాడు. నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం అంటూ మరో రెండు ట్వీట్లు శనివారం చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/