మరోసారి నిరాశ పరిచిన సింధు

P. V. Sindhu
P. V. Sindhu

హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15-11, 13-15, 9-15తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (బెంగళూరు రాప్టర్స్‌) చేతిలో ఓడింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌5లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 0-3తో బెంగళూరు రాప్టర్స్‌ చేతిలో ఓడిపోయింది. అయితే సొంత అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి సింధు ఓటమి షాక్‌కు గురి చేసింది. ఆద్యంతం తడబడి ఓటమితో నిరాశపర్చింది. అయితే తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 8-15, 9-15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్‌ ఈస్టర్స్‌ వారియర్స్‌) చేతిలో పరాజయంపాలైంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/