సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు

సుబ్బయ్య వస్తే ఎదురు చూడమని మాత్రమే చెప్పా..ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ

సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు
proddatur-municipal-commissioner-radha

ప్రొద్దుటూరు: టిడిపి నాయకుడు సుబ్బయ్య హత్య ఘటన కలకలం రేపింది. ఈ కేసులో స్థానిక వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారుమునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధలపై ఆరోపణలు వచ్చాయి. వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మృతుడి భార్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాధ మాట్లాడుతూ, ..సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదని అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన కుటుంబసభ్యులు తన పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పారు. హత్య జరిగిన సమయంలో తాను హోమంలో ఉన్నానని… అక్కడకు సుబ్బయ్య వస్తే కాసేపు ఎదురుచూడమని మాత్రమే చెప్పానని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్త ల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/