షర్మిలకు క్షేమపణలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి

వైస్ షర్మిల కు తెరాస మంత్రి నిరంజన్ రెడ్డి క్షేమపణలు తెలిపారు. షర్మిల చేపట్టిన మంగళవారం నిరుద్యోగ దీక్షలను ఉద్దేశించి నిరంజన్ మాట్లాడుతూ..కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ షర్మిల ఫై కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ ఫై వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఆందోళనలకు దిగడంతో తాను చేసిన కామెంట్స్ కు క్షేమపణలు కోరారు.

తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై చేసిన వ్యాఖ్యలు తొందరపాటు చర్యగా ఆయన చెప్పారు. మనోభావాలు దెబ్బతింటే సారీ అని మంత్రి అన్నారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్‌పై పరుష పదజాలంతో వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతకు ముందు మంత్రి నిరంజన్‌ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేసిన షర్మిల.. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని నిలదీసారు. అయినా చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని అన్నారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని మండిపడ్డారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని షర్మిల అన్నారు.