కెసిఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య

ponnala-lakshmaiah-joins-brs-in-jangaon

జనగామః సిఎం కెసిఆర్‌ సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బిఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు. బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు, వర్గాల అభ్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం అతిశయోక్తి కాదు అన్నారు.

ప్రస్తుతం రాజకీయ పార్టీలు రకరకాలుగా ఉన్నాయని.. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు.. ఎన్నికల తరువాత రాజకీయ పార్టీలు వేరు అన్నారు. అయితే ఈ దేశానికి, రాష్ట్రానికి స్పూర్తి దాయకం బిఆర్ఎస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లోనే బిఆర్ఎస్ కులగణన మీద ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. బలహీన వర్గాలను అణచివేస్తూ.. మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడం పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా తాను 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడాలి. జనగామ నియోజకవర్గంలో డైరీ డెవలప్ మెంట్ అభివృద్ధి చేయాలని సిఎం కెసిఆర్ ని కోరారు.