ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం

నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు జగన్ సర్కార్ కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశానికి తాకుతుండడం తో ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో జగన్ డీజిల్ ధరల బాధల తో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. 100 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడానికి ఆర్టీసీ రంగం సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి లలో 350 విద్యుత్ బస్సులను న‌డ‌పాల‌ని ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) అద్దె ప్రాతిపదికన బ‌స్సుల‌ను త్రిప్పడానికి ఏపీఎస్ ఆర్టీసీ టెండర్లను సైతం పిలిచింది. ఈ క్రమంలో మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ హైద్రాబాదు మరియు మెస్సర్స్ అశోక్ లేలాండ్, చెన్నై సంస్థ‌లు పాల్గొన్నాయి. మెస్పర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంద్ర డీజిల్ బస్సు రేటుతో ఎలక్ట్రిక్ బస్సులు త్రిప్పుటకు ఒప్పుకుంది. మెన్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి నుండి నిర్దేశించిన మార్గాలలో బ‌స్సుల‌ను నడుపనుంది.