కుప్పం పర్యటనలో జగన్ ఫై మండిపడ్డ చంద్రబాబు ..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కుప్పం పర్యటన లో బిజీ అయ్యారు. గత కొన్ని నెలలుగా కుప్పంలో రాజకీయాలు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పైచేయి సాధిస్తూ వస్తుంది. చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ పైచేయి సాధించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో బాబు కుప్పం పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. రెండున్నరేళ్ల నుంచి మీరు మాట్లాడిన మాటలు, మేం మాట్లాడిన మాటలు ప్రజలు ముందు ఉంచుదాం. ప్రజలు నాది తప్పని తేల్చితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం. మరి మీ సంగతేంటి మిస్టర్ జగన్… ఎక్కడికి వస్తావు… కుప్పం వస్తావా, పులివెందుల వస్తావా, అమరావతి వస్తావా, విశాఖ వస్తావా, తిరుపతి పవిత్ర దేవాలయానికి వస్తావా, లేకపోతే మీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

ఏం మీరు అంటే మేం పడాలా? మీ గురించి మాట్లాడితే మా ఆఫీసులపై దాడి చేస్తారా? పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నీ కేసులకు భయపడి మేం నీకు దాసోహం అనాలా? నీకు భయపడి మేం పారిపోవాలా? ఒక్క చాన్స్ అంటూ అడిగితే అవకాశం ఇచ్చారు… కానీ దద్దమ్మ ప్రభుత్వం వచ్చింది” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.

నా పర్యటనకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను రాష్ట్రంలో తిరగకూడదా? నేను చేసిన తప్పేంటి? ఏమడిగాను నేను? రాష్ట్రంలో గంజాయి పండిస్తున్నారు… చర్యలు తీసుకోమని అడిగాను. గంజాయి తీసుకుంటే పిల్లలు ఏమవుతారు? ఆ మాట అడిగితే సమాధానం చెప్పరు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. తయారీ అంతా జగన్ దే. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయి అన్నారు.