తొమ్మిదేండ్ల బాలుడిపై ఓ 17 ఏండ్ల బాలుడు అత్యాచారయ‌త్నం..

సమాజంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి..అభం శుభం తెలియని చిన్నారుల దగ్గరి నుండి ఒంటరి మహిళలు , ముసలివారు ఇలా ఎవర్ని వదిలిపెట్టడం లేదు కామాంధులు. కేవలం ఆడవారిని కాదు మగవారిని సైతం వదలడం లేదని తాజా ఘటన తో బయటపడింది. చెన్నైలోని మ‌ధుర‌వోయ‌ల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో తొమ్మిదేండ్ల బాలుడిపై ఓ 17 ఏండ్ల బాలుడు అత్యాచారయ‌త్నం చేసాడు. అయితే, అందుకు తొమ్మిదేండ్ల బాలుడు స‌హ‌క‌రించ‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి లోనైన 17 ఏళ్ల బాలుడు తీవ్రంగా దాడిచేశాడు. ప‌క్క‌నే ఉన్న బండ ముక్క‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టాడు.

దీంతో ఆ బాలుడు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో నిందితుడు పారిపోయాడు. తమ కుమారుడు కనిపించడం లేడని పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దాంతో కేసు న‌మోదు చేసి గాలింపు చేప‌ట్టిన పోలీసులకు మ‌ధుర‌వోయ‌ల్ బైపాస్ స‌మీపంలో అప‌స్మార‌క స్థితిలో బాలుడు క‌నిపించాడు. వెంట‌నే బాలుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. 17 బాలుడు నిందితుడిగా గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.