హైదరాబాద్ లో గంట పాటు భారీ వర్షం.. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలి

హైదరాబాద్ లో గంట పాటు భారీ వర్షం.. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలి

హైదరాబాద్ లో గంట పాటు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. హైదరాబాద్ లో వర్షం పడితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గంట పాటు వర్షం పడితే రోడ్లన్నీ నదులు తలపిస్తాయి. ఎక్కడిక్కడే వాహనాలు నిలిపోతాయి. ముఖ్యంగా సాయంత్రం వేళా వర్షం పడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా వాతావరణ శాఖ నగరవాసులను అలర్ట్ చేసింది.

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిన్నటి నుండి వానలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.