వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన బండి సంజయ్

వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన బండి సంజయ్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైట్ ఛాలెంజ్‌ నడుస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన వైట్ ఛాలెంజ్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సవాల్ మేరకు వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరారు. విశ్వేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ ను బండి సంజయ్ స్వీకరించారు. తనకు ఎలాంటి అలవాట్లు లేవని.. అక్టోబర్ 2తో పాదయాత్ర పూర్తి అవుతుంది… ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్.

ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడ్తామంటున్నారని.. దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. మక్కలు, వడ్లు కొనకపోతే కొనేటట్లు బీజేపీ.. కెసిఆర్ మెడలు వంచుతదని.. పోడు భూముల మీద కొట్లాడితే మా మీద కేసులు పెట్టారని మండిపడ్డారు.