సంస్కరణలశీలి పీవీ
తెలంగాణ సీఎం కెసిఆర్ నివాళి

Hyderabad: మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నిరంతర సంస్కరణల శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
పి.వి.నరసింహా రావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పి.వి.నరసింహా రావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.
అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పి.వి.నరసింహారావు అవలంబించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని సిఎం కొనియాడారు.
బహు భాషా వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పి.వి.కి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని గుర్త చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/