భారత్‌ స్కోరు 163/3

INDIA vs NEW ZEALAND Match
INDIA vs NEW ZEALAND Match

మౌంట్‌ మాంగనుయ్‌:  న్యూజిలాండ్ తో చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులు చేయగా, మరో ఓపెనర్ సంజూ శాంసన్ (2) మరోసారి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్ లో రాణించిన రోహిత్ శర్మ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో అలరించాడు. అయితే కండరాల గాయం బాధించడంతో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆఖర్లో మనీష్ పాండే 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ తో 11 పరుగులు రాబట్టాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/