అప్పటి వరకు మెరుపు ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తా

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న షెఫాలీ వర్మ

Shafali Verma
Shafali Verma

పెర్త్‌: భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను అందుకునే వరకు మెరుపు ఇన్నింగ్స్‌లను ఇలానే కొనసాగిస్తా అని యువ ఓపెనర్ షెఫాలీ వర్మ అంటోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షెఫాలీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ శైలిలో ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ 17 బంతుల్లోనే 39 పరుగులు సాధించింది. షెఫాలీ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అద్భుతంగా ఆడిన షెఫాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ దక్కింది. మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అందుకునే సమయంలో షెఫాలీ వర్మ మాట్లాడుతూ… ‘సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్‌లో లేకపోవడంతో ఎంతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు శుభారంభం అందించాలనుకున్నా. భారీ షాట్లు ఆడటం కోసం బంతిని బలంగా బాదుతూ ప్రాక్టీస్‌ చేశా. జట్టుకు మరిన్ని విజయాలు అందించడమే నా అంతిమ లక్ష్యం. భారత్‌ ప్రపంచకప్‌ను అందుకునే వరకు నా మెరుపు ఇన్నింగ్స్‌లను ఇలానే కొనసాగిస్తా’ అని తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/