ఇదే ఐపిఎల్ 2020 షెడ్యూల్

ముంబయి: ఐపిఎల్ 2020 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఐపిఎల్ నిర్వాహకులు వివరాలను అధికారిక వైబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే వేదికగా తొలి ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ 30న ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్, ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 56 మ్యాచ్‌లు జరుగనుండగా అందులో ప్రతీ ఆదివారం రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.


తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/