కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీ

KL Rahul
KL Rahul

మౌంట్‌ మౌంగనూయి: భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 46 ఓవర్లకు గానూ నాలుగు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. భారత్‌ అత్యుత్తమ పేసర్‌ కేఎల్‌ రాహుల్‌ శతకంతో శుభారంభం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 62 పరుగుల వద్ద నీశమ్‌ బౌలింగ్‌లో గ్రాండ్‌ హోంకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. భారత్‌కు తొలి వికెట్‌ రూపంలో మయాంక్‌ అగర్వాల్‌ ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా తొమ్మిది పరుగులు మాత్రమే చేసి బెనెట్‌ బౌలింగ్‌లో జమ్సీన్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక పృథ్వీషా 40 పరుగులు చేసి రనౌట్‌ రూపంలో క్రీజు వదిలాడు.ప్రస్తుతం క్రీజులో రాహుల్ (104), పాండే (41) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ పై శ్రేయస్ అయ్యర్, రాహుల్ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్ పై రాహుల్, పాండే 94 పరుగుల భాగస్వామ్యంతో ఆటను కొనసాగిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/