హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ మృతి

మెదడు సంబంధిత వ్యాధితో చికిత్సపొందుతూ మృతి

Hockey Legend Balbir Singh (File)
Hockey Legend Balbir Singh (File)

భారత హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మే 8 నుంచి చికిత్స పొందుతున్న బల్బీర్‌ సింగ్‌ నేడు తుదిశ్వాస విడిచారు.

బల్బీర్‌ సింగ్‌ సోమవారం ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని మొహాలీలోని పోర్టిస్ట్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ అభిజిత్‌ సింగ్‌ వెల్లడించారు.

1948, 1952, 1956 ఒలింపిక్స్ లో బల్బీర్‌ సింగ్‌ భారత హాకీ టీంకు మూడు స్వర్ణపతకాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

అంతేకాకుండా 1975 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ భారత హాకీ టీంకు చీఫ్‌ కోచ్‌, మేనేజర్‌ గా వ్యవహరించారు.

ఒలింపిక్స్ పురుషుల హాకీ ‌ లో అత్యధిక గోల్ఫ్స్‌ చేసిన వ్యక్తిగా బల్బీర్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు.

బల్బీర్‌ సింగ్‌ కు కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/