మోడిపై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

Shahid Afridi
Shahid Afridi

కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోడి ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్‌పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగవవు అని అన్నాడు.తాజాగా షాహిద్ ఆఫ్రిది ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ… ‘భారత్‌, పాకిస్తాన్ దేశాల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోడి. మోడి అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి మనకు స్పందన రాదు. భారతీయులు సహా మనందరికీ మోడి ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఆయన తిరోగమన ఆలోచనా ధోరణితో ఉన్నారు’ అని అన్నాడు.’సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి మరొకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ.. భారత ప్రధాని మోడి ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి. అసలు మోడి ఎజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమవ్వడం లేదు’ అని అఫ్రిది అంటున్నాడు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి మాట్లాడుతూ భారత క్రికెట్‌ను మెచ్చుకున్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/