ట్రంప్ భారత్ పర్యటన తేదీలు ఖరారు
అధికారిక ప్రకటన చేసిన శ్వేతసౌధం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 24, 25 తేదిలో ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో కలిసి భారత్‌లో పర్యటిస్తారు. ఈవిషయాన్ని మంగళవారం శ్వేతసౌధ్యం వెల్లడించింది. కాగా ట్రంప్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈనేపథ్యంలో ట్రంప్ ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనునన్నారని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ వెల్లడించారు. అయితే గతవారం ప్రధాని మోడి, ట్రంప్‌తో పర్యటనపై ఫోన్ చర్చించారని తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖారాలకు చేరుతుందని ఆకాంక్షించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/