కందుకూరు ఘటనపై సిఎం జగన్ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం

అమరావతిః నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా ఇంతే మొత్తంలో పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/