తెలుగు రాష్ట్రాల హైకోర్టు లకు కొత్త జడ్జీలు

తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్‌ ఆరాధే.. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ నియామకం అయ్యారు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల హైకోర్టు లకు కొత్త జడ్జీలు రాబోతున్నారు. బొంబాయి. గుజరాత్‌, ఒడిశా, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై చర్చించారు.

తెలంగాణ HC చీఫ్ జస్టిస్ గా కర్ణాటక HC జడ్జిగా ఉన్న అలోక్ ఆరాధేను, ఏపీ HC చీఫ్ జస్టిస్ గా బాంబే HC జడ్జిగా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను నియమించింది. బాంబే HCకి దేవేంద్రకుమార్, గుజరాత్ కు సునీతా అగర్వాల్, మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్ర నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.