విజవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్న వాల్తేర్ వీరయ్య

ఈ మధ్య కాలంలో వారం రోజుల పాటు సినిమా రన్ అవ్వడమే గగనమైన ఈరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ ఏకంగా 25 రోజులు సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ కలెక్షన్ తో రన్ అయ్యి అందర్నీ ఆశ్చర్య పరిచింది. చిరంజీవి – బాబీ దుకాలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ కీలక పాత్రలో సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు బ్రహ్మ రధం పట్టారు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ తో కలిసి సినిమా చూసిన సినిమాలే లేవు. ఒక్క వాల్తేర్ వీరయ్య తప్ప. చిన్న , పెద్ద ఇలా అంత సినిమాను ఎంజాయ్ చేసారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది.

ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సరికొత్త పోస్టర్ ను వదిలారు. నేటి తో 25 రోజులు అవుతున్న ఇంకా చాల థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతున్నాయి. ఇక ఈ నెల 17వ తేదీన ‘శాకుంతలం’ విడుదల కానుంది. అప్పటివరకూ కూడా వీరయ్య హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.