ఢిల్లీలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు

పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

New Delhi
New Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దాదాపుగా అన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలోదట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు రైళ్ల రాకపోకల్లో అంతరాయమేర్పడుతోంది. ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంట ఆలస్యంగా నడుస్తోందని నార్తన్‌ రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భగల్‌పూర్‌ ఆనంద్‌విహార్‌ విక్రమ్‌శిల ఎక్స్‌ప్రెస్‌, పూరిన్యూఢిల్లి పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌, వాస్కోనిజాముద్దీన్‌ గోవా ఎక్స్‌ప్రెస్‌ తదితర పలు రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వారు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/