గుజరాత్‌ అసెంబ్లీ పోలింగ్‌..మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం పోలింగ్

Gujarat Polls : 50.51 per cent voter turnout recorded till 3pm in the second

అహ్మదాబాద్: గుజరాత్‌లో రెండో దశ (చివరి దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 50.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రం 5 గంటలకు అంటే మరో రెండు గంటల్లో పోలింగ్‌ ముగియనుంది. అయినా సగం పోలింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం.

గుజరాత్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు సబర్‌కాంత జిల్లాలో అత్యధికంగా 57.24 శాతం పోలింగ్‌ నమోదైంది. అహ్మదాబాద్‌లో అత్యల్పంగా 44.44 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ నెల 1న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/