మరోసారి అఖండ కాంబో

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండగే. వీరిద్దరి కాంబో లో వచ్చిన సింహ , లెజెండ్ , అఖండ చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో అది బోయపాటికి బాగా తెలుసు. అందుకే వీరి కాంబో అంటే అందరికి అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108 మూవీ చేస్తున్న బాలయ్య..నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను తోనే అని తెలుస్తుంది.

ఇది బాలయ్య కెరియర్లో 109వ సినిమా కానుంది. అందరూ కూడా ఇది ‘అఖండ’కి సీక్వెల్ అనుకున్నారు. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అనే విషయం తెలుస్తోంది. బాలయ్య పొలిటికల్ కెరియర్ కి హెల్ప్ అయ్యేలా ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. కథ రాజకీయాల నేపథ్యమే అయినా, మాస్ యాక్షన్ పరంగా ఇద్దరి మార్క్ కనిపిస్తూనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం బోయపాటి ..హీరో రామ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.