తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్ర పోతుందంటూ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ తెలంగాణ లో నిఘా వ్యవస్థ నిద్ర పోతుందంటూ విమర్శించారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు విధ్వసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వందలమంది రావడం ..స్టేషన్ ను ధ్వసం చేయడం, పలు రైళ్లను తగలబెట్టడం వంటివి జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ దాడులపై ఎమ్మెల్యే రఘునందన్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడికి వేలమంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పాడుకుందా అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకురాలు ఎస్ ఐ కాలర్ పట్టుకుంటే పోలీసులు ఎం చేస్తున్నారని, టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలో కలిసి పోటీ చేయడానికే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి డ్రామా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనల పట్ల రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని రఘునందన్ డిమాండ్‌ చేశారు. సైన్యంలో చేరాలనుకొనే యువకులు అల్లర్లకు పాల్పడరు అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం గుండాలను పంపి అల్లర్లను ప్రొత్సహించారని, అగ్నిపథ్‌ మీద చర్చకు ట్విట్టర్ మంత్రి సిద్దమా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. ట్విట్టర్ లో హింసాత్మాక ఘటనలు ప్రొత్సహించే మీ అకౌంట్ బ్లాక్ చేయాల్సి వస్తందటూ ఆయన హెచ్చరించారు. నేడు చోటు చేసుకున్న అల్లర్ల వెనుక కచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయంగా మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక.. అప్రదిష్టపాలు చేయాలన్న నీచమైన కుట్రతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు సృష్టించారని మాజీ మంత్రి , బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వాల్లో ఉన్న వారు, బాధ్యత గలిగిన రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించవన్నారు. రాజకీయాల్లో ప్రజల హృదయాను గెలుచుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో పలుకుబడి కోల్పోయినటువంటి కొన్ని పార్టీలు..అసహనంతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమైన చర్య మండిపడ్డారు. శాంతియుతంగా కొందరు నిరసన తెలపాలని వస్తే..వారిలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు.