టెండూల్కర్‌ మొదటి లవ్‌ ఎవరో తెలుసా?

sachin tendulkar
sachin tendulkar

ముంబయి: వాలెంటైన్స్‌ డే పురస్కరించుకొని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్న వేళ.. క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం తన ప్రేమను అభిమానులతో పంచుకున్నాడు. మై ఫస్ట్‌ లవ్‌ అంటూ నెట్స్‌లో క్రికెట్‌ సాధన చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. దీనికి వేల మంది లైక్‌లు కొడుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బుష్‌ఫైర్‌ ఛారిటీ మ్యాచ్‌ సందర్భంగా.. పాంటింగ్‌ XI జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిష్ట్‌ XI పై పాంటింగ్‌ XI ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఛారిటీ మ్యాచ్‌ జరుగుతున్న వేళ విరామ సమయంలో లిటిల్‌మాస్టర్‌ మరోసారి బ్యాట్‌ పట్టుకున్నాడు. ఎల్లిసే పెర్రీ బౌలింగ్‌లో ఒక ఓవర్‌ పాటు బ్యాటింగ్‌ చేసి అభిమానులను అలరించాడు. మరోవైపు భారత్‌లో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ పేరిట మార్చి 7 నుంచి 22 వరకు నిర్వహించే ఐదు దేశాల టోర్నీలో సచిన్‌ భారత జట్టుకు సారధిగా ఉండనున్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/