రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం
పార్టీ నుంచి నాకు భరోసాలు ఏమీ లేవు

అమరావతి: వైఎస్‌ఆర్‌సిసి నేత మోపిదేవి వెంకటరమణ మండలి రద్దయితే తన మంత్రి పదవి పోతుందన్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మంచి జరగడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ నుంచి తనకు భరోసాలు ఏమీ లేవని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు తామే పదవులు త్యాగం చేస్తామని మోపిదేవి ఉద్ఘాటించారు. మండలిపై నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/