గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Woman died in road accident
Woman died in road accident

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయ సమీపంలో గురువారం జరిగిన ఘటనలో ఓ మహిళా మృతిచెందింది. కాగా సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను వెనక నుంచి వస్తున్న ఐసన్‌ వ్యాన్‌ ఢీకొట్ట‌డంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. భార్యభర్తలు కేసరపల్లికి చెందిన వారని, మేధా టవర్స్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/