ఆ పాపానికి వర్మ. శిక్ష అనుభవించే తీరుతాడట

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..పెద్ద పాపం చేసాడని..ఆ పాపానికి శిక్ష అనుభవించే తీరుతాడని శాపనార్దాలు పెడుతున్నారు. ఇంతకీ వర్మ చేసిన ఆ పాపం ఏంటో తెలుసా..? మైసమ్మ అమ్మవారికి విస్కీ మందు తాగించడమే. వర్మ ఏపనిచేసిన , ఏ ట్వీట్ చేసిన..ఏ సినిమా చేసిన సరే అది వార్తల్లో నిలువాల్సిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో వెబ్ సిరీస్ లతో బిజీ గా గడిపిన ఆయన..ఇప్పుడు కొండా దంపుతుల జీవిత చరిత్ర తో ‘కొండా’ అనే బయోపిక్ తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబదించిన ఓపెనింగ్ కార్య క్రమాలు నిన్న వరంగల్ లో జరిపారు.

ఈ ‘కొండా’ మూవీ ప్రారంభోత్సవం కాస్త వెరైటీగా ప్లాన్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఊరేగింపుగా వరంగల్ చేరుకున్నారు. ఈ ప్రయాణంలో మధ్యలోనే వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలోని అమ్మవారికి మందు తాగించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ”నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా.. చీర్స్” అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వర్మ తీరును తప్పుబడుతూ కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు.

”RGV గారు మీరు ఎంతో మేధావి, మాటకారి అని తెలుసు, కానీ ఏ దేవుడు నీ కూడా హేళన చేయకూడదు. ఇది క్షమించరాని పాపం. ఈ పాపానికి శిక్ష అనుభవించే టైమ్‌లో మాత్రం కసాయి వాడు కూడా మీ మీద కనికరం చూపించడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ”వాస్తవమే కదా వర్మ గారు.. ఊర్లలో ఎల్లమ్మ, మైసమ్మ పండగలు చేసినపుడు ముందుగా దేవుడికి పోస్తారు” అని అంటున్నారు. మొత్తం మీద వర్మ కొండా ఓపెనింగ్ తోనే వార్తల్లో నిలిచారు.