ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు

అమరావతి : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజీకుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతనెల 27న మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద సీఐడీ పోలీసులు వారిపై సోమవారం కేసు నమోదు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/