వైద్య విద్యార్ధుల అవస్థలు

బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న వైనం

kakatiya medicle college
kakatiya medical college

వరంగల్‌: కరోనా బారిన పడిన రోగులకు చికిత్స చేయడం వరంగల్‌ లోని నర్సులకు ఇబ్బందిగా మారింది. జనతా కర్ప్యూ రోజు వైద్యులకు సంఘీబావంగా చప్పట్లుకొట్టిన ఇంటి యజమానులే తమను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటున్నారని వరంగల్‌ కేఎంసీ (కాకతీయ మెడికల్‌ కాలేజ్‌)లో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్ధిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, స్టూడెంట్స్‌, హౌస్‌ సర్జన్‌లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కేఎంసీలోనే మరో 50 మందికి వసతిని ఏర్పాటు చేస్తామని హమి ఇచ్చారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/