జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ కు భారీ ఊరట..

కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. మల్కాజిగిరి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అజారుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అజారుద్దీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్ మాల్ విషయంలో కొందరు చేసిన ఫిర్యాదుతో అజారుద్దీన్ తో పాటు మరికొందరిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం నాడు విచారించిన న్యాయస్థానం అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.