పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. పద్మావతి అమ్మవారి దర్శనార్దం తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి చైర్మన్ అందించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/