వారణాసి లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్న బండి సంజయ్

బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి లో జరుపుకోబోతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ తన ప్రతి పుట్టిన రోజు వేడుకలను కార్యకర్తలు , అభిమానుల సమక్షంలో అట్టహాసంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఎంపీ అవ్వకముందు అయిన తర్వాత కూడా కరీంనగర్ కార్యకర్తలతో వేడుకలు జరుపుకున్న బండి సంజయ్.. పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కరీంనగర్ కార్యకర్తలతోపాటు హైదరాబాదులోని పార్టీ కార్యకర్తలతో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.

కానీ ఈసారి మాత్రం కార్యకర్తలకు , అభిమానులకు దూరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం.. కొత్త అధ్యక్షుడు నియామకం జరగడంతో అటు సంజయ్ లోను, అలాగే ఆయన అనుచరులలోను కొంత బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తల మధ్య ఉంటే వారు బాధపడతారనే ఉద్దేశంతో సంజయ్.. తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు సోమవారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్లారు.