వీధికుక్కలను పట్టుకునేందుకు నేపాల్ క్యాచింగ్ బృందాలను రంగంలోకి దింపిన తెలంగాణ సర్కార్

వీధి కుక్కలను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. నేపాల్ నుండి క్యాచింగ్ బృందాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని కొన్ని నెలలుగా పిర్యాదులు వస్తున్న పెద్దగా పట్టించుకోని సర్కార్..రీసెంట్ గా పెద్ద అంబర్ పేట్ లో చోటుచేసుకున్న ఘటన తో చలనం వచ్చింది. నాలుగేళ్ల బాలుడిని అతి కిరాతకంగా వీధి కుక్కలు కొరికి కొరికి చంపేశాయి. ఈ ఘటన ఫై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వీధి కుక్కలను కట్టడి చేయాలనీ కోరారు. దీంతో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇప్పటికే వీధికుక్కల స్వైరవిహారం.. దాడులను అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం టోల్​ఫ్రీ నంబర్​ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్​ఎంసీ అధికారులు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వీధికుక్కలను పట్టుకుని తీసుకువెళ్తున్నారు. అయినా రోజూ ఏదో ఓ చోట ప్రజలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగానే కుక్కలను పట్టుకునేందుకు నేపాల్‌ బృందాలను తీసుకు వస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌కు చెందిన నిపుణులు కుక్కలను పట్టుకోవడంలో నిష్ణాతులు. ప్రమాదకమైన జంతువులనూ బంధించగలరు.తక్కువ సమయంలో ఎక్కువ మూగ జీవాలను బంధించేందుకు తెలంగాణ సర్కార్ నేపాల్ బృందాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.