ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దవుతున్న నగరం..

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

No respite for Telangana as rains continue to lash state

హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దవుతోంది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారాయి. అలాగే హుస్సేన్‌సాగర్‌ సైతం నీటితో నిండిపోయింది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్ది కొత్తగూడెం, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా కెరిమెరిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/