కర్నూల్ లో బాలయ్య 107 మూవీ షూటింగ్

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 107 మూవీ తాజా షెడ్యూల్ కర్నూల్ లో మొదలైంది. ఈ మధ్యనే బాలకృష్ణ కరోనా బారినపడడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. తాజాగా బాలకృష్ణ కరోనా నుండి బయటపడడం తో తిరిగి షూటింగ్ లో బిజీ అయ్యారు.

కర్నూలో ప్రారంభమైన తాజా షెడ్యూల్​ షూటింగ్​లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు అభిమానులు , అక్కడి జనం పోటెత్తారు. బాలయ్య బాబును చూసిన ఆనందంలో ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్యాన్స్​ ర్యాలీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్​​ సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. సెట్​లో బాలయ్య మాస్ లుక్​ కనిపించాడు. ‘రాయల్టీ కా బాప్’​ అంటూ ఫ్యాన్స్​ ఈ ఫొటోలను ట్రెండ్ చేస్తూన్నారు.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.