‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్య లుక్‌ను రిలీజ్

‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య లుక్‌ను రిలీజ్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, నాగ చైతన్య లు నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్టు 11 న తెలుగు , తమిళ్ . హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. దీంతో చిరంజీవి తెలుగు కు సంబదించిన ప్రమోషన్ కార్య క్రమాలను జరుపుతున్నారు. రీసెంట్ గా కరీనా కపూర్ లుక్ ను రిలీజ్ చేసిన చిరు..ఈరోజు నాగ చైతన్య లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.
“లాల్‌సింగ్ చడ్డా, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ను మీకు పరిచయం చేస్తున్నా. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు” అంటూ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత అమిర్ నటించిన ఈ సినిమాను అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. అమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్ పాండే, వయాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించటానికి తన శరీరాన్ని ఈ వయసులో బాగానే కష్టపెట్టారట. రీసెంట్ గా హైదరాబాద్ చిరంజీవి ఇంట్లో ఈ చిత్ర ప్రివ్యూ ను చిరంజీవి , రాజమౌళి , అమిర్ ఖాన్ , నాగ చైతన్య , నాగార్జున , సుకుమార్ తదితరులు చూడడం జరిగింది.