పైబర్ నెట్ కేసు..చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు

chandrababu-anticipatory-bail-hearing-adjourned-in-supreme-court

న్యూఢిల్లీః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో మీగతా వారికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ చంద్రబాబుకు మాత్రం కోర్టు మంజూరు చేయలేదు. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు రాగా.. జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. కాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చే నెల 8 కి వాయిదా వేసింది.

అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ఈ కేసులోనూ వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయరాదని చంద్రబాబు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించి రెండు పిటిషన్లు, ఏసీబీ కోర్టులో నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.