NBK108 ‘మోనార్క్ ‘..?

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో NBK108 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ధమాకా ఫేమ్ శ్రీలీల..బాలకృష్ణ కు కూతురి గా నటిస్తుంది. కాగా ఈ మూవీ కి మోనార్క్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం ముందుగా “బ్రో..ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ను పరిశీలించారట మేకర్స్.

అయితే “బ్రో” టైటిల్ ను పవన్ సినిమా కోసం వాడేస్తుండటంతో.. ప్రస్తుతం ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పక్క మాస్ అండ్ రివెంజ్ డ్రామాతో రానున్న ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.