గంటా మ‌న‌వ‌డి బ‌ర్త్ డే..చంద్ర‌బాబు హాజ‌రు

జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం అన‌కాప‌ల్లి వెళ్లిన చంద్ర‌బాబు
విశాఖ‌లో ఆగి గంటా ఇంటికి వెళ్లిన వైనం

అమరావతి : టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌న‌వ‌డి పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం విశాఖ‌లోని గంటా ఇంటిలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన చంద్ర‌బాబు… గంటా మ‌న‌వ‌డిని ఎత్తుకుని మ‌రీ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. బ‌ర్త్ డే వేడుకల్లో భాగంగా కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మంలోనూ చంద్ర‌బాబు పాలుపంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా గంటా కుమారుడు రవితేజను చంద్రబాబు భుజం తట్టి మరీ అభినందించారు.

తనమనవడి పుట్టిన రోజు వేడుకలకు స్వయంగా చంద్రబాబు హాజరు కావడం పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనందుకు చంద్రబాబు అన్నకు ధన్యవాదాలు అంటూ గంటా బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే… బుధ‌వారం నుంచి చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా త‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం నుంచి ప్రారంభించ‌నున్నారు. ఇందుకోసం బుధ‌వారం ఉద‌యం విశాఖ వెళ్లిన చంద్ర‌బాబు…గంటా ఇంట బ‌ర్త్ డే వేడుక‌ల స‌మాచారం తెలుసుకుని అక్క‌డికి వెళ్లి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/