ఉగాది కానుకగా NBK108 ఫస్ట్ లుక్ రిలీజ్

అఖండ , వీర సింహ రెడ్డి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న నందమూరి బాలకృష్ణ ..ప్రస్తుతం తన 108 వ చిత్రం చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ఉగాది సందర్బంగా ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్ తోనే నందమూరి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు అనీల్ రావిపుడి. ఇక సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన అనిల్ రావిపుడి ఒక అభిమాని ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా బాలకృష్ణని చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లో ధమాకా ఫేమ్ శ్రీలీల కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.