ఆగస్టు లో భోళా శంకర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న భోళాశంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మెహర్ రమేష్ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈరోజు ఉగాది సందర్బంగా మెగా అభిమానులకు చిత్ర యూనిట్ మెగా ట్రీట్ అందజేసింది. ఈ సినిమాను ఆగస్టు 11, 2023న విడుదల చేస్తున్నట్లు మేకర్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుండీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో కీర్తి సురేష్ , చిరంజీవి, తమన్నా లు పోస్టర్ లో కనిపిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.