నేడు ప్రధాని మోడితో సిఎం జగన్‌ భేటి

పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న జగన్

AP CM Jagan met PM Modi
AP CM Jagan met PM Modi

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఈరోజు ప్రధాని నరేంద్రమోడితో సమావేశం కానున్నారు. రాష్ట్రాభివృద్ధి, తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సిఎం జగన్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈనేపథ్యంలోనే జగన్‌ పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు.
మరోవైపు, ఎన్డీయేలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ, కేంద్ర మంత్రి పదవులను వైఎస్‌ఆర్‌సిపికి మోడి ఆఫర్ చేశారనే వార్తల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/