ఆకట్టుకుంటున్న నయన తార – విఘ్నేష్ శివన్ పెళ్లి శుభలేఖ

మొత్తానికి నయన తార పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. గత కొద్దీ రోజులుగా డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ భామ..జూన్ 9న వీరిద్దరూ ఒకటికాబోతున్నారు. ముందుగా తమ వివాహాన్ని తిరుపతిలో చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఫైనల్ గా వారి వివాహ వేదిక ను చెన్నైకి దగ్గరలో ఉన్న మహాబలిపురంకు మార్చారు. అక్కడే వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నారు. తాజాగా పెళ్లి కార్డు ను ఎంపిక చేసుకున్నారు. పెళ్ళి కార్డ్ లో నయన్ అండ్ విక్కీ అని సింపుల్ గా వీరిద్దరి పేర్లూ కనిపిస్తున్నాయి. మోషన్ పోస్టర్ స్టైల్లో రివీలవుతున్న ఈ శుభలేఖకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

2015లో మొట్టమొదటి సారిగా ‘నానుమ్ రౌడీ దాన్’ (నేనూ రౌడీనే) చిత్రం సెట్లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు విఘ్నేష్ శివనే. ఈ సినిమా తర్వాత నయన్, విఘ్నేష్‌ల ప్రేమ వ్యవహారం జనానికి తెలిసింది. నిజానికి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నయనతార పదకొండేళ్ళక్రితం శాస్త్రోక్తంగా హిందూ ధర్మాన్ని స్వీకరించింది. దీంతో పెళ్లికి విఘ్నేష్ ఫ్యామిలీ నుండి అభ్యంతరం లేకుండా పోయింది. ఇక ఈ పెళ్లి వేడుకకు అతి కొద్దీ మంది సినీ ప్రముఖులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. విజయ్ సేతుపతి, సమంత, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితర కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్ళికి రాబోతున్నారని టాక్. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో ‘ఓ2’ అజిత్ 62వ చిత్రంలో, మలయాళంలో పృధ్విరాజ్ ‘గోల్డ్’ అనే మూవీలో, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రాల్లో నటిస్తుంది.