నేడు ఆర్థిక ప్యాకేజీ వివరాలు

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం.. వివరాలు తెలుపనున్న నిర్మలా సీతారామన్

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోడి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరించి చెప్పనున్నారు. కాగా భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఈ ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నిన్న ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/