వైస్సార్సీపీ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని లోకేష్ ప్రశ్న ..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. టీడీపీ-వైస్సార్సీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నాయి. గత కొద్దీ రోజులుగా టీడీపీ బాదుడే బాదుడు అంటూ సోషల్ మీడియా లో వైస్సార్సీపీ పార్టీ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహానాడు వేదిక ఫై కూడా అదే స్థాయిలో టీడీపీ నిప్పులు చెరిగింది. దీనికి కౌంటర్ గా వైస్సార్సీపీ నేతలు సైతం టీడీపీ ఫై , మహానాడు ఫై కామెంట్స్ , విమర్శలు , సెటైర్లు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీపై, సీఎం జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

వైస్సార్సీపీ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని లోకేష్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి ఉంటున్నారని.. గేటు బయట బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఉంటున్నారని విమర్శించారు. రెండు వేల కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వద్ద అటెంటర్ నుంచి ఐఏఎస్ వరకు ఒకే సామాజిక వర్గం ఉందని విమర్శించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకా..? అని ప్రశ్నించారు. మీరు చేయాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదని.. రెడ్డి సామాజిక రైలు యాత్ర అని ఎద్దేవా చేశారు.