పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

ఓ కాంట్రాక్టు ఉద్యోగిని పట్ల వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు

national-st-commission-issues-notice-to-ap-school-education-principal-secretary-praveen-prakash

అమరావతిః ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు పంపింది. ప్రవీణ్ ప్రకాశ్ ఓ కాంట్రాక్టు ఉద్యోగిని పట్ల వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు అందింది. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పి.నిర్మల అనే మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన ఎస్టీ కమిషన్… వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ ను ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు విధించింది.